కెన్యా
ఆఫ్రికా ఖండం లొని దేశం / From Wikipedia, the free encyclopedia
కెన్యా (ఆంగ్లం Republic of Kenya), అధికారికగా కెన్యా గణతంత్రం, తూర్పు ఆఫ్రికా లోని ఒక దేశం. పాక్షిక స్వయంప్రతిపత్తి కలిగిన 47 ఆఫ్రికా దేశాలలో ఇది ఒకటి. కెన్యా జనసంఖ్య 52.2 మిలియన్లు. అత్యధిక జనసాంధ్రత కలిగిన ప్రపంచ దేశాలలో కెన్యా 27 వ స్థానంలో ఉంది. కెన్యా పాలనాబాధ్యతలను ఎన్నిక చేయబడిన గవర్నర్లు నిర్వహిస్తారు. కెన్యా వైశాల్యపరంగా 580,367 square kilometres (224,081 sq mi), ప్రపంచదేశాలలో 48 వ స్థానంలో ఉంది. కెన్యా ఉత్తరసరిహద్దులో ఇథియోపియా, ఈశాన్యసరిహద్దులో సోమాలియా, దక్షిణసరిహద్దులో టాంజానియా దేశాలు ఉన్నాయి. దీని రాజధాని నైరోబి.[4][5] [6] పురాతన నగరం, మొట్టమొదటి రాజధాని సముద్రతీర నగరం మొబాంసా. విక్టోరియా సరోవరతీరంలో ఉన్న కిసుము సిటీ మూడవ పెద్ద నగరం. ఇతర ముఖ్యమైన పట్టణ కేంద్రాలలో నకురు, ఎల్డోరెటు నగరాలు ఉన్నాయి.
Jamhuri ya Kenya జమ్హూరియా కెన్యా కెన్యా గణతంత్రం |
||||||
---|---|---|---|---|---|---|
|
||||||
నినాదం "Harambee" (Swahili) "Let us all pull together" |
||||||
జాతీయగీతం |
||||||
రాజధాని | నైరోబి 1°16′S 36°48′E | |||||
అతి పెద్ద నగరం | Nairobi | |||||
అధికార భాషలు | Swahili, English[1] | |||||
ప్రజానామము | Kenyan | |||||
ప్రభుత్వం | Semi-presidential Republic | |||||
- | అధ్యక్షుడు | Uhuru Kenyatta | ||||
- | ప్రధాన మంత్రి | Raila Odinga | ||||
Independence | from the United Kingdom | |||||
- | Date | December 12, 1963 | ||||
- | Republic declared | December 12, 1964 | ||||
- | జలాలు (%) | 2.3 | ||||
జనాభా | ||||||
- | July 2008 అంచనా | 37,953,8401 (36th) | ||||
- | 8 February 2007 జన గణన | 31,138,735 | ||||
జీడీపీ (PPP) | 2008 అంచనా | |||||
- | మొత్తం | $61.172 billion[2] | ||||
- | తలసరి | $1,734[2] | ||||
జీడీపీ (nominal) | 2008 అంచనా | |||||
- | మొత్తం | $31.418 billion[2] | ||||
- | తలసరి | $890[2] | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) | 0.521 (medium) (148th) | |||||
కరెన్సీ | Kenyan shilling (KES ) |
|||||
కాలాంశం | EAT (UTC+3) | |||||
- | వేసవి (DST) | not observed (UTC+3) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .ke | |||||
కాలింగ్ కోడ్ | +254 | |||||
1. According to cia.gov, estimates for this country explicitly take into account the effects of mortality due to AIDS; this can result in lower life expectancy, higher infant mortality and death rates, lower population and growth rates, and changes in the distribution of population by age and sex, than would otherwise be expected.[3] |
నిలోటో-భాషావాడుకరులైన పాస్టోలిస్టులు (కెన్యా నీలోటికు మాట్లాడే పూర్వీకులు) ప్రస్తుత దక్షిణ సూడాన్ నుండి క్రీ.పూ 500 లో కెన్యా ప్రాంతాలకు వలసవచ్చారు.[7] 19 వ శతాబ్దంలో ఐరోపా అన్వేషణతో కెన్యా ఐరోపా కాలనీకరణ ప్రారంభమైంది. ఆధునిక కెన్యా 1895 లో బ్రిటీషు సామ్రాజ్యంచే స్థాపించబడిన ఒక ప్రొటొరేటు నుండి ఉద్భవించింది. తరువాత 1920 లో కెన్యా కాలనీ ప్రారంభమైంది. 1952 లో గ్రేటు బ్రిటషు, కాలనీల మధ్య ప్రారంభమైన అనేక వివాదాలు మాయు మాయు విప్లవానికి దారితీశాయి. ఫలితంగా 1963 లో స్వాతంత్ర్య ప్రకటన చేయబడింది. స్వాతంత్ర్యం తరువాత కెన్యా కామన్వెల్తు ఆఫ్ నేషన్సు సభ్యదేశంగా ఉంది. ప్రస్తుత రాజ్యాంగం 1963 స్వాతంత్ర్య రాజ్యాంగం స్థానాన్ని 2010 లో పునర్నిర్మించబడిన రాజ్యాంగం భర్తీ చేసింది.
కెన్యా ప్రెసిడెంటు ప్రతినిధ్యం వహించే ప్రజాస్వామ్య రిపబ్లికు దీనిలో ఎన్నికైన అధికారులు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు. అధ్యక్షుడు దేశానికి, ప్రభుత్వానికి అధిపతిగా ఉంటారు.[8] కెన్యా ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఇతర అంతర్జాతీయ సంస్థలలో సభ్యదేశంగా ఉంది. సభ్యుడు. 1,460 GNI తో [9] కెన్యా ఒక తక్కువ-మధ్య-ఆదాయం కలిగిన ఆర్థిక వ్యవస్థగా వర్గీకరించబడింది తూర్పు, మధ్య ఆఫ్రికాలో కెన్యా ఆర్థిక వ్యవస్థ అతిపెద్దది, [10][11] నైరోబీ ప్రధాన ప్రాంతీయ వాణిజ్య కేంద్రంగా పనిచేస్తోంది.[11] వ్యవసాయం అతిపెద్ద రంగం; టీ, కాఫీ సాంప్రదాయ నగదు పంటలుగా ఉన్నాయి. తాజా పువ్వులు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎగుమతిగా ఉంది. సేవా పరిశ్రమ ప్రధాన ఆదాయవనరుగా (పర్యాటక రంగం) ఉంది. కెన్యా తూర్పు ఆఫ్రికన్ కమ్యూనిటీ వర్తక సంఘంలో సభ్యదేశంగా ఉంది. అయితే కొన్ని అంతర్జాతీయ వర్తక సంస్థలు గ్రేటరు హార్ను ఆఫ్ ఆఫ్రికాలో భాగంగా వర్గీకరించాయి.[12] కెన్యా అతి పెద్ద ఎగుమతి మార్కెట్టుగా ఆఫ్రికా ఉంది. తర్వాత స్థానంలో ఐరోపా సమాఖ్య ఉంది.[13]