కాలింపాంగ్ జిల్లా
వెస్ట్ బెంగాల్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
కాలింపాంగ్ జిల్లా భారతదేశం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని ఒక జిల్లా. నిజానికి ఇది డలింగ్కోట్ తాలూకాగా పిలువబడే [lower-alpha 1] ప్రాంతం. ఇది ప్రత్యామ్నాయంగా సిక్కిం, భూటాన్ల నియంత్రణలో ఉంది.1865లో ఇది సించులా ఒప్పందం ప్రకారం బ్రిటిష్ ఇండియాచే భూటాన్ నుండి విలీనం చేయబడింది.1916 నుండి 2017వరకు డార్జిలింగ్ జిల్లా ఉప విభాగంగా ఉంది.[2] [3] 2017లో ఇది పశ్చిమ బెంగాల్ 21వ ప్రత్వేక జిల్లాగా ఏర్పడింది.[3][4]
Kalimpong | |||||||
---|---|---|---|---|---|---|---|
District | |||||||
Clockwise from top-left: Zang Dhok Palri Phodang, Morgan House in Kalimpong, Kagyu Thekchen Ling Monastery, view from Rishyap, Neora Valley National Park | |||||||
Country | India | ||||||
State | West Bengal | ||||||
Division | Jalpaiguri | ||||||
ముఖ్యపట్టణం | Kalimpong | ||||||
Government | |||||||
• Lok Sabha constituencies | Darjeeling (shared with Darjeeling district) | ||||||
• Vidhan Sabha constituencies | Kalimpong | ||||||
Area | |||||||
• Total | 1,053.60 km2 (406.80 sq mi) | ||||||
Population (2011)[1] | |||||||
• Total | 2,51,642 | ||||||
• Density | 240/km2 (620/sq mi) | ||||||
Time zone | UTC+05:30 (భా.ప్రా.కా) |
జిల్లా ప్రధానకార్యాలయం కాలింపాంగ్లో ఉంది.ఇది బ్రిటీష్ కాలంలో ఇండో-టిబెటన్ వాణిజ్యానికి వ్యాపార పట్టణంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీనికి ఉత్తరాన సిక్కింలోని పాక్యోంగ్ జిల్లా, తూర్పున భూటాన్, పశ్చిమాన డార్జిలింగ్ జిల్లా, దక్షిణాన జల్పాయిగురి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాలో కాలింపాంగ్ పురపాలక సంఘం, కాలింపాంగ్ I, కాలింపాంగ్ II, గోరుబతన్ అనే మూడు కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్లు ఉన్నాయి.