కల్నల్ సాండర్స్
From Wikipedia, the free encyclopedia
కల్నల్ హార్లాండ్ డేవిడ్ సాండర్స్ [lower-alpha 1] (1890 సెప్టెంబరు 9 – 1980 డిసెంబరు 16) అమెరికన్ వ్యాపారవేత్త, ఫాస్ట్ ఫుడ్ చికెన్ రెస్టారెంట్ల శ్రేణి కెంటుకీ ఫ్రైడ్ చికెన్ (దీనిని KFC అని కూడా పిలుస్తారు) ను స్థాపించాడు. తరువాత కంపెనీ వ్యాపార రాయబారిగా, చిహ్నంగా పనిచేశాడు. అతని పేరు, చిత్రం ఇప్పటికీ కె.ఎఫ్.సి సంస్థకు చిహ్నాలుగా ఉన్నాయి. "కల్నల్" అనే బిరుదు గౌరవప్రదమైనది - కెంటుకీ కల్నల్ - సైనిక హోదా కాదు.
సాండర్స్ తన ప్రారంభ జీవితంలో ఆవిరి యంత్రాలకు బొగ్గులు వేసే ఉద్యోగంలో, ఇన్సూరెన్స్ అమ్మకం దారుగా, ఇంధనాన్ని నింపే కేంద్రంలో పనివాడిగా అనేక ఉద్యోగాలను చేసాడు. అతను ఆర్థిక మాంద్యం సమయంలో కెంటుకీలోని నార్త్ కార్బిన్‌లోని రోడ్డు ప్రక్కన రెస్టారెంట్ ను నిర్వహిస్తూ వేయించిన కోడిమాంసం అమ్మడం ప్రారంభించాడు. ఆ సమయంలో సాండర్స్ తన రహస్య వంటకంను, ప్రెజర్ ఫ్రైయర్లో కోడిమాంసం వంటలకు పేటెంటు హక్కులు పొంది వాటిని అభివృద్ధి చేశాడు. సాండర్స్ ఫలహార శాల రంగంలో గొలుసుకట్టు దుకాణాలు(ఫ్రాంఛైజింగ్) భావన సామర్థ్యాన్ని గుర్తించాడు. మొదటి కెఎఫ్సి గొలుసుకట్టుదుకాణం 1952 లో ఉటా లోని సౌత్ సాల్ట్ లేక్‌లో ప్రారంభించబడింది. తన అసలు రెస్టారెంట్ మూసివేసిన తరువాత, తన వేయించిన చికెన్‌ను దేశవ్యాప్తంగాగొలుసుకట్టు దుకాణాలు అభివృద్ధి చేయడానికి పూర్తి సమయం కేటాయించాడు.
అమెరికా సంయుక్తరాష్ట్రాలలో, విదేశాలలో కంపెనీ వేగంగా విస్తరించడం సాండర్స్ కు మహర్దశ పట్టింది. 1964 లో తన 73 సంవత్సరాల వయస్సులో, అతను కంపెనీని జాన్ వై. బ్రౌన్ జూనియర్, జాక్ సి. మాస్సే నేతృత్వంలోని పెట్టుబడిదారుల బృందానికి $2 మిలియన్లకు (ఈ రోజు 16.5 మిలియన్లు) విక్రయించాడు. అయినప్పటికీ, అతను కెనడాలో కార్యకలాపాల నియంత్రణ అతను చేసేవాడు. అతను కెంటుకీ ఫ్రైడ్ చికెన్ కోసం జీతం పొందిన వ్యాపార రాయబారి అయ్యాడు. తన తరువాతి సంవత్సరాల్లో, అతను కెఎఫ్సి ఫలహారశాలలు అందించే ఆహారాన్ని తీవ్రంగా విమర్శించాడు. ఎందుకంటే అవి ఖర్చులు తగ్గించి, నాణ్యత క్షీణించటానికి కారణమయ్యాయని నమ్మాడు.