అక్వేరియం
అక్వేరియం దీనిని నీటితో నిండిన పాత్ర లేదా గ్లాస్ ట్యాంక్ అని పిలుస్తారు / From Wikipedia, the free encyclopedia
అక్వేరియం (ఆంగ్లం: Aquarium) అనేది నీటితో నిండిన పాత్ర లేదా గాజు తొట్టె. దీనిలో ప్రత్యక్ష జల జంతువులను లేదా మొక్కలను ఉంచుతారు. ఆంగ్ల ప్రకృతి శాస్త్రవేత్త ఫిలిప్ హెన్రీ గోస్సే రూపొందించిన ఆక్వేరియం అనే పదానికి, లాటిన్లో ఆక్వా అంటే 'నీరు' అని అరియం అంటే 'సంబంధిత స్థలం' అని అర్ధం. ఆక్వేరియం సూత్రాన్ని రసాయన శాస్త్రవేత్త రాబర్ట్ వారింగ్టన్ 1850లో, ఒక కంటైనర్‌లోని నీటిలో మొక్కలు జంతువులకు మద్దతుగా తగినంత ఆక్సిజన్‌ను ఇస్తాయని వివరించాడు. 1853లో లండన్ జూలో మొట్టమొదటి పబ్లిక్ అక్వేరియంను గోస్సే సృష్టించాడు. ఇతను 1854లో మొదటి మాన్యువల్, "ది అక్వేరియం: యాన్ అన్‌వెయిలింగ్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ది డీప్ సీ"ని ప్రచురించాడు.[1] చేపలను కలిగి, అక్వేరియంను నిర్వహించే వారిని ఆక్వేరిస్ట్ అంటారు. అక్వేరియం సాధారణంగా గాజు లేదా అధిక శక్తి కలిగిన యాక్రిలిక్‌తో నిర్మించబడుతుంది. క్యూబాయిడ్ అక్వేరియంను ఫిష్ ట్యాంకులు లేదా కేవలం ట్యాంకులు అని కూడా పిలుస్తారు, గిన్నె ఆకారంలో ఉండే అక్వేరియంను ఫిష్ బౌల్స్ అని కూడా అంటారు.